Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ అతను డార్లింగ్‌ - నాకు మాత్రం తమన్నా...

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2012 (20:10 IST)
WD
" ప్రభాస్‌కు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువని విన్నాను. సినిమా షూటింగ్‌లో కూడా చాలా జెంటిల్‌గా ఉంటాడు. చాలా హైట్‌" అంటూ నటి దీక్షాసేథ్‌ ప్రభాస్‌ గురించి చెప్పింది. 'రెబల్‌' సినిమాలో ఆమె నటించింది. ఆమెతోపాటు తమన్నా కూడా నటించింది. సెకండాఫ్‌లో దీక్షా పాత్ర వస్తుంది. ఇద్దరు హీరోయిన్లు కలుసుకోరట. దర్శకుడు రాఘవ లారెన్స్‌ అద్భుతంగా తెరకెక్కించాడట సినిమాను.

తమన్నా మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు '100%లవ్‌'లో పెర్‌ఫార్మెన్స్‌ పాత్ర చేశాను. డాన్స్‌ పరంగా పెద్దగా చేయలేదు. రెబల్‌లో లారెన్స్‌ మాస్టర్‌ నాచేత డాన్స్‌ చేయించారు. ఆయన నా గురువు. అద్భుతంగా వచ్చింది" అంది.

దీక్షాసేథ్‌ మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరోయిన్‌ తమన్నా. చాలా క్యూట్‌గా తెల్లగా ఉంటుంది. డాలింగ్‌ అంటూ అప్పుడప్పుడూ పిలుస్తా"నంటూ వ్యాఖ్యానించింది. రెబల్‌ సినిమా టీజర్‌ గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలైంది.

ఈ నెల 25న ఆడియోను విడుదల చేస్తామని త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు జె.పుల్లారావు, దానయ్య తెలిపారు. ఈ చిత్రంలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్‌ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్‌.నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్‌ శంకర్‌, విశాల్‌, ఆకాష్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న 'రెబల్‌' చిత్రానికి మాటలు: డార్లింగ్‌ స్వామి, ఫోటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్‌: బుజ్జి, కిరణ్‌, నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు, కథ-స్క్రీన్‌ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్‌.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments