Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కార్టూనిస్టులకు "లైఫ్‌టైమ్" అవార్డులు

Webdunia
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు (ఐఐసీ) మే నెల 18వ తేదీన జాతీయ కార్టూనిస్టుల రెండో సమ్మేళనం సందర్భంగా... దేశంలోని ఏడుగురు ప్రముఖ కార్టూనిస్టులకు జీవితకాల పురస్కారాలను ప్రదానం చేయనుంది.

వీరిలో... ఇ.పి. ఉన్నీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ), హెచ్.పి.శుక్లా (కాక్- ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్), వసంత సర్వతే (ముంబై, మహారాష్ట్ర), టి. వెంకట్రావు (విశాలాంధ్ర, విజయవాడ), ప్రభాకరరావు బాయిల్ (ధార్వార్, కర్ణాటక), థామస్ (టామ్, కొట్టాయం, కేరళ), మదన్ (చెన్నై)లు ఉన్నట్లు.. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఓ ప్రకటనలో తెలియజేసింది.

ఇదిలా ఉంటే... మన రాష్ట్రానికి చెందిన టి. వెంకట్రావు (టీవీ)కు ఐఐసీ జీవితకాల పురస్కారం లభించడం, ఆయన కీర్తి కిరీటంలో ఓ కలికితురాయిగా నిల్చిపోతుంది. విశాలాంధ్ర సీనియర్ కార్టూనిస్టుగా పనిచేస్తున్న టీవీ, 2004లో బెస్ట్ కార్టూనిస్టు పురస్కారం కూడా అందుకున్నారు. అలాగే, యునైటెడ్ నేషన్ కూడా ఆయనకు గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే...!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments