Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న మీద కోపంతో పార్టీ పెట్టలేదు కేటీఆర్ గారూ : వైఎస్ షర్మిల

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (10:48 IST)
అన్నమీద కోపముంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ స్థాపించుకోవాలంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు తెరాస మంత్రి కేటీఆర్ సూచించారు. దీనికి షర్మిల ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అన్నమీద కోపతో తెలంగాణాలో పార్టీ పెట్టలేదంటూ వివరణ ఇచ్చారు. 
 
తాము పార్టీ పెట్టడానికి కారణం మీ అయ్య కేసీఆర్ గారూ అని కేసీఆర్‌కు చెప్పారు. రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల బలవన్మరణాలు చూడలేకు, రీడిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే తెలంగాణాలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణా ఉద్యమంలో కేటీఆర్, కేసీఆర్‌‍లు లాఠీ దెబ్బలు తిన్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు. 
 
బలిదానం చేసుకున్నారా? పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్ట మర్చిపోయింది మీరు. గడ్డాలు పెంచుకుని దీక్ష చేసింది మీరు. అమరుల బలిదానాలపై అధికారంలోకి వచ్చింది మీరు. ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకుంది మీరు. అనేక పోరాటాలు చేసి, కేసీఆర్ మెడలు వంచిన ఘనత మాది. మీరు మొనగాళ్లైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
 
బీజేపీ గంగా ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేసింది కానీ గోదారి ప్రక్షాళనకు రూపాయి ఇయ్యలె. అయోధ్య రాముడు వేరు? భద్రాద్రి రాముడు వేరా? మాకు బీజేపీతో పొత్తు ఉందని కేటీఆర్ అంటున్నాడు. అయ్యా కేటీఆర్.. మాకు ఎవరితోనూ పొత్తు అక్కర్లేదు. మేం ఎవరి ఏజెంట్లం కాదు. బీజేపీతో పొత్తు ఉంది మీకు.
 
ఇన్నాళ్లు బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరు. ఇక్కడ ఉంది వైఎస్ఆర్ బిడ్డ. సింహం సింగిల్ గానే వస్తుంది. మాకు వైఎస్ఆర్ బొమ్మ ఉంది. వైఎస్ఆర్ అనే పేరుంది. వైఎస్ఆర్ సంక్షేమ పాలనే మా ఆస్తి. ముమ్మాటికీ తెరాస, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు చీలుస్తాం. పేదవాడి పక్షాన నిలుస్తాం. పేదవాడికి వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తాం అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments