Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరిసేడు గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహారదీక్ష

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:43 IST)
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల మరోమారు నిరుద్యోగ నిరాహారదీక్షకు దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఆమె ఈ దీక్షను ప్రారంభించారు. 
 
ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
 
షబ్బీర్‌ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని ష‌ర్మిల‌ భరోసా ఇచ్చారు. అనంతరం ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి సిరిసేడులో దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్ష‌ సాయంత్రం 5 గంటల వరకు జ‌ర‌గ‌నుంది. 
 
తెలంగాణ‌లో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ష‌ర్మిల గతంలోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు ఈ దీక్షను పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments