Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పోరాటానికి సిద్ధమైన వైఎస్ షర్మిల... 72 గంటల పాటు..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (10:10 IST)
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల శనివారం దీక్ష చేయనున్నారు. 72 గంటల పాటు వైయస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు.
 
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహారదీక్షకు కూర్చోనున్నారు వైఎస్ షర్మిల. మిగతా 48 గంటలు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు వైయస్ షర్మిల. రైతులకు అండగా ఉండేందుకు షర్మిల ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
 
ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు పై ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీలు ధర్నా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రైతుల పట్ల కేంద్ర విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అలాగే రైతులు అందరూ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments