Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ క్రేజ్ - జస్ట్ మిస్... (Video)

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (09:52 IST)
"యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ క్రేజ్.. ఖాజీపేట్‌లో రైలు పక్కన ఫీట్ చేసిన వడ్డేపల్లికి చెందిన యువకుడు.. రైలు వేగం ధాటికి ఒక్క ఉదుటున కిందపడటంతో తప్పిన ప్రాణముప్పు" తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన. 
 
నేటి యువతకు సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైంది. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్స్ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా వరంగల్ ప్రాంతంలోనూ ఓ యువకుడు ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ కోసం పెద్ద రిస్క్ తీసుకున్నాడు. అయితే, అతడికి భూమిపై నూకలు ఉండటంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. 
 
వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన ఓ యువకుడు ఇన్‌స్టా రీల్స్ కోసం ఓ వీడియో చేసేందుకు రైల్వే ట్రాక్‌ను ఎంచుకున్నాడు. రైలు వేగంగా వస్తుండగా దాని పక్కనే తాను నడుస్తున్నట్టుగా ఓ వీడియో తీయాలన్నది అతని పట్టుదల. అతను అనుకున్నట్టుగానే ఖాజీపేట వద్ద ఓ రైలు వేగంగా వస్తుండగా దానికి అత్యంత దగ్గరగా నడిచే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ రైలు వేగానికి యువకుడు ఒక్కసారికా పక్కకు పడిపోయాడు. అయితే, అతడి ప్రాణాలకు మాత్రం ముప్పువాటిల్లేదు. కానీ, ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments