Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లి చేసుని కాపురం పెట్టిన భర్త.. దేహశుద్ధి చేసిన తొలి భార్య

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (21:48 IST)
తొలి భార్య ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొని కాపురం పట్టిన భర్తను పట్టుకొని దేహశుద్ధి చేసింది మొదటి భార్య.. ఈ ఘటన సోమవారం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా ముఠాకొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. పరశురాంకి, ధనలక్ష్మీతో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 
 
వీరంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే వ్యాపరం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరుశురాం.. మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీనితో అనుమానం వచ్చి ఆరా తీయగా.. కామారెడ్డికి చెందిన కవిత అనే ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది. 
 
దీనితో ధనలక్ష్మి సోమవారం బంధువులతో కలిసి వచ్చి భర్తను చితకబాదింది. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని పరుశురాం రెండో భార్య కవిత ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments