Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణ, వన్యప్రాణుల పరిరక్షణ: విద్య ప్రాముఖ్యత, వ్యక్తుల ప్రమేయంపై WWF ఇండియా ఎర్త్ సిరీస్

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (20:08 IST)
ప్రముఖ ప్రకృతి పరిరక్షణ సంస్థ WWF-ఇండియా ఈరోజు తమ టాక్ షో “ఎర్త్ సిరీస్: కన్జర్వేషన్ మేటర్స్”ను ప్రారంభించింది, ఇది క్లిష్టమైన పర్యావరణ సమస్యలను తీర్చటం  మరియు వన్యప్రాణుల పరిరక్షణ లక్ష్యం గా  చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా, ప్రముఖ పక్షి శాస్త్రవేత్త మరియు సంరక్షకుడు డాక్టర్ అసద్ రహ్మానీ "యాన్ అమేజింగ్ వరల్డ్ ఆఫ్ బర్డ్స్" అనే అంశంపై తన ప్రారంభ ప్రసంగాన్ని చేశారు. తన ప్రసంగం ద్వారా, డాక్టర్ రహ్మానీ చెరగని ప్రభావాన్ని కలిగించటం మాత్రమే కాదు, వన్యప్రాణుల సంరక్షణ కోసం సామూహిక సామాజిక విలువల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం ద్వారా ఆహూతులకు ఆలోచననూ రేకెత్తించారు.
 
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి ప్రసాద్ రచించిన తాజా పుస్తకం ‘బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ని విడుదల చేయడం ద్వారా ఈ విశిష్ట కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రసాద్ యొక్క తాజా పుస్తకం అతని రెండు మహోన్నతమైన అభిరుచులు- ఒక స్థిరమైన సంస్థను సృష్టించడం, తన ఫోటోగ్రఫీ ద్వారా పక్షుల గొప్పతనాన్ని ఒడిసిపట్టడంను అందంగా విలీనం చేసింది. ఈ ప్రత్యేకమైన ఛాయాచిత్రాల కలెక్షన్  ప్రకృతి, వన్యప్రాణులు, అడవులు, పర్వతాల పట్ల ఆయనకున్న గాఢమైన ప్రేమను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ప్రతి ఆకర్షణీయమైన ఫోటో ప్రసాద్‌తో లోతుగా ప్రతిధ్వనించిన స్ఫూర్తిదాయకమైన అంశాలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీని స్థాపించడానికి అతని మార్గంలో మార్గనిర్దేశనమూ చేసింది. 
 
WWF-ఇండియా హైదరాబాద్ ఆఫీస్ ఈ ఎర్త్ సిరీస్ టాక్ షో నిర్వహించింది. ఒత్తిడితో కూడిన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను మార్పిడి చేయడానికి, భూగోళం యొక్క జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్న వ్యక్తులు, సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఒక వేదికగా ఇది పనిచేస్తుంది. విభిన్న రంగాల నుండి నిపుణులు, ఔత్సాహికులను ఒకచోట చేర్చడం ద్వారా, ఈ సిరీస్ రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్న చేంజ్ మేకర్స్ యొక్క శక్తివంతమైన నెట్‌వర్క్‌ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
"WWF ఎర్త్ సిరీస్‌లో ప్రారంభ ప్రసంగాన్ని అందించడానికి, శ్రీ జి.వి ప్రసాద్ యొక్క తాజా పుస్తకం ఆవిష్కరణలో భాగమవ్వడానికి నన్ను ఆహ్వానించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా పక్షులు వున్నాయి, వీటిని సాధారణంగా పరిశీలించటం, అనేకమందిలో ప్రకృతి అద్భుతాల పట్ల ఆసక్తిని రేకెత్తిస్తాయి." అని డాక్టర్ అసద్ రహ్మానీ అన్నారు. “ఈ రోజు మనం ఎదుర్కొంటున్న క్లిష్టమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి WWF ఎర్త్ సిరీస్ ఒక అమూల్యమైన వేదికను అందిస్తుంది. ‘బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ ఆవిష్కరణతో, ఇది ప్రకృతి అద్భుతాల పట్ల లోతైన ఆసక్తిని  ప్రేరేపించడమే కాకుండా ప్రజలు తమ సంస్థలను ప్రకృతి అనుకూల మార్గంలో నిర్మించడంలో సహాయపడుతుందని నా ఆశ”, అని డాక్టర్  రెడ్డిస్  కో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జి వి ప్రసాద్ అన్నారు.
 
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వ్యక్తులు, విశిష్ట పక్షి శాస్త్రవేత్తలు, నిబద్ధత కలిగిన సంరక్షకులు, బర్డ్ వాచర్స్, ప్రభుత్వ అధికారులు, బ్యూరోక్రాట్స్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావటంతో పాటుగా పర్యావరణ-వన్యప్రాణుల పరిరక్షణ పట్ల తమ అంకితభావం, నిబద్దత వెల్లడించారు. ఈ కార్యక్రమం యొక్క విజయం పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణ కోసం పెరుగుతున్న ప్రపంచ ఆందోళనను ప్రతిబింబిస్తుంది. WWF యొక్క ఎర్త్ సిరీస్ ఈ దిశగా ఒక ఆశాకిరణంగా ఉద్భవించింది, హరిత మరియు మరింత పర్యావరణ అనుకూల గ్రహం కోసం తగిన  చర్యలు  తీసుకోవడానికి వ్యక్తులు మరియు సంఘాలను ప్రేరేపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments