Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో కారు నడిపి.. పలువురుని గుద్దిన యువతి!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (10:06 IST)
హైదరాబాద్‌లో పబ్ కల్చర్ శృతిమించిపోతోంది. ఈ పబ్‌లకు వెళ్లే యువతులు, మహిళలు పీకల్లోతు వరకు మద్యం సేవించడమే కాకుండా, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నగర రోడ్లపై మద్యం సేవించిన ఓ మహిళ కొద్దిసేపు అలజడి సృష్టించింది. 
 
మద్యం నిషా నషాళానికెక్కడంతో హైదరాబాద్ రోడ్లపై హల్ చల్ చేసింది. ఆ యువతి చేతిలోని కారు పలువురిని గుద్దుకుంటూ ముందుకెళ్లింది. అయినా ఆ మహిళ కారును ఆపకుండానే ముందుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిపాటి శ్రమతో కారును నిలిపేసి యువతిని కటకటాల వెనక్కి పంపించారు. ఈమె వద్ద జరిపిన విచారణలో... ఆ యువతిని షహనాజ్‌గా తేలింది. ఆమెకు ఇదేమీ కొత్త కాదని, గతంలోనూ పలుమార్లు ఇదే రీతిన మద్యం మత్తులో కారు నడిపి పలువురిని గాయపరిచిందని తేలింది. 
 
సోమవారం రాత్రి ర్యాష్ డ్రైవింగ్‌లో షహనాజ్, ఇద్దరిని గాయపరిచింది. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్‌పై వలపన్నిన పోలీసులు ఎట్టకేలకు షహనాజ్ ర్యాష్ డ్రైవింగ్‌కు బ్రేకులేశారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి, సోదాలు చేయగా, షహనాజ్ కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో పోలీసులు కంగుతిన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో ఆమె చేసిన ప్రమాదాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments