పనిమనిషితో సంసారం చేస్తున్న భర్త.. దీక్షకు దిగిన భార్య.. ఎక్కడ..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (22:57 IST)
పనిమనిషితో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను వదిలేశాడు ఓ భర్త. అయితే ఆ భర్త మాత్రం తన భర్త కోసం దీక్షకు దిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని 8వ వార్డు సాయినగర్ కాలనీలో తన భర్తను తనకు వదిలిపెట్టాలంటూ ఒక భార్య దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 
 
తూర్పాటి బిక్ష్యం దంతలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన రామానుజమ్మకు మూడు దశబ్ధాల క్రితం పెళ్లి అయింది. ఐదుగురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో పని మనిషి రూపంలో ఆ కుటుంబంలో కలకలం రేగింది. ఇంట్లోని పనిమనిషితో తన భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని భార్య రామానుజమ్మ ఆరోపిస్తుంది.
 
పనిమనిషిని పెళ్లి చేసుకుని తనను, తన పిల్లలను భర్త పట్టించుకోవడం లేదని చెబుతోంది. తన భర్తను తనకు వదిలేయాలని అడిగితే పనిమనిషి దాడులు చేస్తుందని, పిల్లలను తన వద్దకు రాకుండా తనను ఒంటరి చేశారని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో ఈ విషయంపై సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, అధికారులు తన భర్త తన వద్దకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments