మటన్ తీసుకురమ్మని భర్తను పంపింది... ప్రియుడితో కలిసి భార్య..

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (14:35 IST)
పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఓ భార్య హతమార్చిన ఘటన  మహబూబ్‌బాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని తెలిసి.. ఆ భార్య  ఈ  దారుణానికి ఒడిగట్టింది. గత నెల 21న మహబూబాబాద్ జిల్లాలోని రేగడితండాలో జరిగిన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
ఇన్నారపు నవీన్-శాంతి దంపతులు మంగలికాలనీలో నివాసం వుంటున్నారు. శాంతి రెండున్నరేళ్లుగా వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం  కొనసాగిస్తోంది. విషయం తెలిసిన నవీన్ భార్యను మందలించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి శాంతి ప్లాన్ చేసింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా  గత  నెల 21న రేగడితండాలోని తన పుట్టింటికి వెళ్లి మటన్ తీసుకురావాల్సిందిగా భర్తను పురమాయించింది. భార్య ప్లాన్ తెలియని భర్త స్కూటీపై రేగడితండా బయలుదేరాడు. దారిలో కాపుకాసిన శాంతి ప్రియుడు వెంకటేశ్, అతడి స్నేహితుడు పద్దం నవీన్‌లు నవీన్‌పై దాడిచేసి, ఇనుప రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు స్కూటీని అతడిపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు.
 
నవీన్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి సేకరించిన మద్యం సీసాలపై ఉన్న బార్‌కోడ్, భార్య సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments