Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరం కలిసి ఆ పనిచేద్దామన్న భర్త... నోట్లో హిట్ కొట్టి చంపిన భార్య...

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జాన్ జయసింగ్ నగర్‌లో దారుణం జరిగింది. మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను బొద్దింకల నివారణకు వాడే పురుగుల మందు హిట్ నోటిలో కొట్టి ప్రాణం తీసింది ఓ ఇల్లాలు. గు

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (13:39 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జాన్ జయసింగ్ నగర్‌లో దారుణం జరిగింది. మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను బొద్దింకల నివారణకు వాడే పురుగుల మందు హిట్ నోటిలో కొట్టి ప్రాణం తీసింది ఓ ఇల్లాలు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవికలు బార్యాభర్తలు. పెళ్లైన నాటి నుంచే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. వీరికి ఇద్దరు పిల్లలు. 
 
జగన్ మద్యానికి బానిసై తీవ్రంగా వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగింది. దేవికను గాజు పెంకులతో జగన్‌ గాయపరచడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త నోట్లో పురుగులను చంపే హిట్ కొట్టేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే పిల్లల కోసం తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా భరించానని, కానీ ఈమధ్య కాలంలో మనం ఇద్దరం కలిసి చనిపోదాం నిన్ను చంపి నేను చనిపోతా అని నిత్యం అంటుండేవాడని భార్య దేవిక తెలిపింది.
 
చనిపోతే మీరు చనిపోండి నేను మాత్రం పిల్లల కోసం బతుకుతానని తరుచూ భర్తకు చెప్పేదానినని అంటుంది దేవిక. గత రాత్రి కూడా మద్యం తాగి చనిపోదాం అంటూ బలవతం చేశాడని, తాగిన బీరు సీసా పగల కొట్టి గాయపరచడంతో తనకు కోపం కట్టలు తెంచుకుందని గత్యంతరం లేక తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments