Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం!.. ఎవరు ఎక్కడ?

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (10:49 IST)
ఆ ఇల్లు పచ్చతోరణం... నిత్యకళ్యాణం. ఎందుకంటే.. ఓ వ్యక్తి ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆ నలుగురు భార్యలు చాలదన్నట్టుగా ఆరుగురుతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెల్సిన పోలీసులతో పాటు, అతనితో సంబంధం ఉన్న మహిళలు కూడా విస్తుపోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భాగ్యనగరికి చెందిన హిమబిందు అనే మహిళకు మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణప్యాలెస్‌కు చెందిన వెంకటబాలకృష్ణ పవన్‌ కుమార్‌తో గత 2018లో వివాహమైంది. 
 
వివాహ సమయంలో కట్నం, ఇతర ఖర్చుల కింద అమ్మాయి తల్లిదండ్రులు రూ.38 లక్షలు ఇచ్చారు. వివాహానంతరం హిమబిందును దుబాయ్ తీసుకెళ్లిన పవన్ అక్కడ తనను వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, తొలి ఇద్దరినీ వదిలేసినట్టు చెప్పిన పవన్.. మూడో భార్యను తనకు పరిచయం చేశాడని పేర్కొంది. అంతేకాక, ఆమే తన నిజమైన భార్య అని చెప్పడంతో విస్తుపోయినట్టు తెలిపింది. తనపై వేధింపులు కొనసాగించడంతోపాటు చంపాలని కూడా చూశాడని ఆరోపించింది. 
 
దీంతో ఒక యేడాది క్రితం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అంతేకాక, మరో ఆరుగురితో సహజీవనం కూడా చేస్తున్నాడని ఆరోపించింది. పెళ్లి పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న పవన్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments