Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్లను ఇంట్లో పెట్టి ఊరెళ్లారు.. ఒక రోగ్ పాములాగా పసిగట్టి వచ్చాడు.. అక్కడ దూరి తప్పించుకుంది

సప్త సముద్రాల అవతల దాచినా ఆడపిల్ల క్షేమానికి గ్యారంటీ లేని సమాజం ఇప్పుడు తయారవుతోంది. ఇంట్లో, బయటా, ఆఫీసుల్లో, ఎక్కడ చూసినా సందు దొరికితే ఆడదాన్ని పట్టుకుని నలిపేయాలనేంతగా కామనరాలు కామాగ్నితో ఉడుకుతున్న నేపథ్యంలో బాత్‌రూమ్‌లే రక్షణ కవచాలుగా మారుతున్న

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (07:58 IST)
సప్త సముద్రాల అవతల దాచినా ఆడపిల్ల క్షేమానికి గ్యారంటీ లేని సమాజం ఇప్పుడు తయారవుతోంది. ఇంట్లో, బయటా, ఆఫీసుల్లో, ఎక్కడ చూసినా సందు దొరికితే ఆడదాన్ని పట్టుకుని నలిపేయాలనేంతగా కామనరాలు కామాగ్నితో ఉడుకుతున్న నేపథ్యంలో బాత్‌రూమ్‌లే రక్షణ కవచాలుగా మారుతున్నాయి. 
 
ఫిలింనగర్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ యువతి తప్పించుకుని రాత్రంతా స్నానపుగదిలో గడిపింది. ఈ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే ఓ టీవీ ఛాన్‌లో పని చేసే రత్నకుమార్‌ (30) యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్నాడు. 
 
సోమవారం పక్కింట్లో ఉన్న వాళ్లు తమ 18ఏళ్ల కుమార్తెను ఇంట్లో ఉంచి వూరెళ్లారు. ఇది గమనించిన రత్నకుమార్‌ రాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి దూరాడు. అత్యాచారం చేయబోయాడు. యువతి తప్పించుకుని ఇంట్లోని స్నానపు గదిలోకి దూరి లోపల గడియా పెట్టుకుంది. రాత్రంతా అందులోనే భయంతో గడిపింది. 
 
గది తలుపు తెరవడానికి యత్నిస్తే అరుస్తానని చెప్పడంతో రత్నకుమార్‌ వెనుదిరిగాడు. దీంతో మంగళవారం బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రత్నకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినోద్‌కుమార్‌ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments