Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ కు ఏమైంది?.. యశోద ఆస్పత్రికి తరలింపు

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:34 IST)
కోవిడ్ బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. సాధారణ హెల్త్ చెకప్‌తో పాటు, కేసీఆర్‌కు సిటీ స్కాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌కు వెళ్లనున్నారు. 
 
కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియా ఎన్నికల సభలో పాల్గొన్నారు. నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.
 
ఇక సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్  విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments