Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంటలకు పరిహారం అందేలా చూస్తాం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:15 IST)
వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా స‌హాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ తెలిపారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌ర‌ద నీటిలో మునిగి దెబ్బ‌తిన్న పంట‌ల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు.

శ‌నివారం పీచ‌ర‌, ధ‌ర్మారం, చింతల్ చాంద‌ గ్రామాల్లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్య‌టించి, పంట‌ల‌ను, చేప‌ల చెరువును ప‌రిశీలించారు. ఏ మేర‌కు  పంట న‌ష్టం వాటిల్లింద‌ని రైతుల‌ను,  అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భారీ వ‌ర్షాల‌ వలన వరద ఉధృతితో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయన్నారు.

వరదల తాకిడి వల్ల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వ పరంగా స‌హాయం అందించేందుకు  రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంద‌ని అన్నారు. వర్షాలు అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments