Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు - బుధవారం విచారణ

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (16:05 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు వ్యవహారంలో నాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని సుప్రీంకోర్టులో సండ్ర పిటిషన్ వేశారు. అలాగే, ఈ కేసు విచారణలో అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు బుధవారం విచారణ జరుపుతామని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం తెలిపింది. 
 
మరోవైపు, ఇదే విషయమై సండ్ర వేసిన పిటిషన్‌ను గత ఏడాది తెలంగాణ హైకోర్టు కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments