Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులో స్టెప్పులు వేస్తూ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసిన సజ్జనార్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (14:29 IST)
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ విధుల్లో చేరిన మరుక్షణం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన మార్క్‌తో సమస్యలు ఎలాంటివైనా వాటిని పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేసమయంలో ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆర్టీసీకి సంబంధించి ఎవరైనా ఏదైనా స్పందిస్తే తక్షణం వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల సమస్యలను తెలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మార్లు ఆయన బస్సుల్లో ప్రయాణించారు. 
 
తాజాగా మరోమారు ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అయితే, ఈ దఫా మాత్రం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం గమనార్హం. సజ్జనార్ కుటుంబంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 
 
పైగా, ఈ బస్సులో ఆయన స్టెప్పులు కూడా వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జర్నీ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆడుతూపాడుతూ కనిపించారు. ఆర్టీసీ బస్సులో సపరివార సమేతంగా బస్సులో ప్రయాణించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments