Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగిత్యాల జిల్లాలో లాక్డౌన్.. నిబంధనలను అతిక్రమిస్తే రూ.1,000 ఫైన్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (13:53 IST)
జగిత్యాల జిల్లాలో కొవిడ్ కేసులు ఇటీవల కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో డిస్ట్రిక్ట్‌లోని కొన్ని విలేజెస్ స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నాయి. వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆ గ్రామ పెద్దలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపారు.
 
గొల్లపల్లి మండలం వెలుగుమట్ల విలేజ్‌లోనూ గ్రామ పంచాయతీ పాలక వర్గం లాక్ డౌన్ విధించింది. సదరు గ్రామంలో కొవిడ్ కేసులతో మరణాలు పెరగకముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు.
 
నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.1,000 ఫైన్ విధించనున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగాను రోజురోజుకూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ముప్పు గురించి కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరిస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు సూచిస్తున్నది. 
 
అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో కేసులు పెరగడాని కంటే ముందుగానే ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు పెళ్లిళ్లకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నది. అతి తక్కువ మంది అతిథుల మధ్యనే శుభకార్యాలు చేసుకోవాలని సూచిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments