Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వృద్ధ నేత జి వెంకటస్వామి పరిస్థితి విషమం : వైద్యులు

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (16:43 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ వృద్ధ నేత, కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి (కాకా) పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం కేర్ ఆసుపత్రి డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 
 
ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు నలుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
గత కొంతకాలంగా కాకా అనారోగ్యంతో బాధపడుతూ, నగరంలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌ విభాగానికి తరలించిన సంగతి తెలిసిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments