Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ ఏ ఒక్కరి విడి సమస్యా కాదు.. సినీ పరిశ్రమను కించపరచడం సరికాదు: వెంకయ్య

మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వాడకం అనేది విశ్వవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు దాన్ని సవాలుగా స్వీకరించాలే తప్ప ఏ ఒక పరిశ్రమలో లేక విభాగానికి సంబంధించిన సమస్యగా చూడరాదలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న

Webdunia
సోమవారం, 31 జులై 2017 (07:37 IST)
మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వాడకం అనేది విశ్వవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు దాన్ని సవాలుగా స్వీకరించాలే తప్ప ఏ ఒక పరిశ్రమలో లేక విభాగానికి సంబంధించిన సమస్యగా చూడరాదలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సంఘటనలు సినీ పరిశ్రమకు చెందిన వారే ఉన్నారని ప్రచారం చేస్తూ కించపరచడం మంచిది కాదన్నారు.  
 
అయితే సినిమా వాళ్లు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటారు కాబట్టి ప్రజలకు అలాంటివారు మార్గదర్శకంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో బాధ్యతతోనూ, సంయమనంతోనూ వ్యవహరించాల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు.
 
బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద ఆదివారం కళామందిర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్‌’పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వెంకయ్యనాయుడుతో పాటు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, వనజీవి రామయ్య, ఆబ్కారీ శాఖ కమిషనర్‌ చంద్ర వదన్, డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్, జీవిత, రాజశేఖర్, గిరిబాబు, మా అధ్యక్షుడు శివాజీ రాజా, కార్యదర్శి నరేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, కళామందిర్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... డ్రగ్స్‌ సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా కేబీఆర్‌ పార్కు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు వాకింగ్ నిర్వహించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments