Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె చావుకు నువ్వే కారణమన్నారు.. విదేశంలో ఉరేసుకున్నాడు..

సోషల్ మీడియా తంపులకూ కార్పణ్యాలకూ ప్రధాన కారకురాలిగా మారుతుందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఒక సంచలన వ్యాఖ్యతో, వక్రీకరణతో దేశాన్ని మండించేటంత పవర్ మీడియాగా మారాక, వ్యక్తుల భావోద్వేగాలు మామూలు జీవితంలో ఊహించలేనంత పరాకాష్టకు చేరుకుంటున్నాయి.

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (04:53 IST)
సోషల్ మీడియా తంపులకూ కార్పణ్యాలకూ ప్రధాన కారకురాలిగా మారుతుందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఒక సంచలన వ్యాఖ్యతో, వక్రీకరణతో దేశాన్ని మండించేటంత పవర్ మీడియాగా మారాక, వ్యక్తుల భావోద్వేగాలు మామూలు జీవితంలో ఊహించలేనంత పరాకాష్టకు చేరుకుంటున్నాయి. దేశదేశాల ప్రజలను, అపరిచితులను పరిచితులుగా మార్చివేస్తున్న ఈ అద్బుతమైన ప్రజా మీడియా ఉట్టిపుణ్యానికే మనుషుల ప్రాణాలనూ తీసేస్తోంది.
 
జగిత్యాల జిల్లానుంచి బతుకుదెరువు కోసం సౌదీ పయనమైన ఒక యువకుడు ఒక అమ్మాయి ఆత్మహత్యకు నువ్వే కారణమంటూ సోషల్ మీడియాలో తనగురించి వచ్చిన పోస్టింగులు చూసి గుండె పగిలి సౌదీ అరేబియాలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరునెలల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లిన కుంట రాజశేఖర్ అనే యువకుడు విదేశానికి వెళ్లడానికి ముందు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటకు చెందిన అమ్మాయిని ప్రేమించినట్లు సమాచారం. కానీ ఆమె ఈ నెల 25న ఏ కారణంతోనో ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీంతో ఆ ఆమ్మాయి చావుకు అతడే కారణమంటూ కొందరు వ్యక్తులు  ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కొందరు పోస్టింగ్‌లు చేసినట్లు వార్త. మీడియాలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలియగానే  రాజశేఖర్ మంగళవారం సౌదీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అమ్మాయి చావుకు కారకులెవరో కానీ తమ కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజశేఖర్ తల్లిదండ్లులు కోరడం కొసమెరుపు.
 
ఇలాంటి ఘటనలు చూస్తే, చదివితే సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదంటున్న వారి అభిప్రాయాలు కూడా ఒక కోణంలో సమంజసమే అనిపించక మానదు కదా.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

క్రైం థ్రిల్లర్ గా వరుణ్ సందేశ్ చిత్రం కానిస్టేబుల్

మోక్షజ్ఞతో ఆదిత్య 369కి సీక్వెల్‌ గా ఆదిత్య 999 మ్యాక్స్

డ్రింకర్ సాయి బ్యాడ్ బాయ్స్ బ్రాండ్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments