Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తెరపైకి వచ్చిన ఈటల రాజేందర్ భూముల వ్యవహారం

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:44 IST)
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈటల భూముల వ్యవహారంలో అధికారులు మరోసారి చర్యలకు ఉపక్రమించారు. 
 
మెదక్‌ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్‌ 97లో సర్వే నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు. పైగా, ఈ నెల 18న సర్వేకు హాజరుకావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డికి తూప్రాన్‌ ఆర్డీవో నోటీసులు పంపించారు.
 
ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సమగ్ర సర్వే కోసం నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో భూముల ప్రాథమిక సర్వే చేశామన్నారు. 
 
ఈ నేపథ్యంలో కొవిడ్  ఉద్ధృతి తగ్గేవరకు సర్వే తాత్కాలిక నిలుపుదల చేయాలని హైకోర్టు సూచించిందని... హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డిప్యూటీ ఇన్​స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు ఇప్పుడు ఇచ్చారని ఆయన వివరించారు. ఈ నెల 16,17 ,18 తేదీల్లో సర్వే ఉంటుందని  కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments