ఆంధ్రా ప్రజలను అనలేదు.. ఆంధ్రా పాలకలను అన్నాను... మంత్రి వేముల

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (13:54 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం క‌డుతోన్న నీటి ప్రాజెక్టుల‌పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఏపీ నేత‌లు కూడా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. 
 
తెలుగు వారంతా ఒక్కటేనని ప్రశాంత్‌రెడ్డి గుర్తించాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హితవు పలికారు. ఏపీ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణమన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై ప్ర‌శాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో మంగళవారం తాను చేసిన ఆ వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన‌వి కాదని, ఆంధ్ర‌పాల‌కుల‌ను ఉద్దేశించి మాత్ర‌మే మాట్లాడానన్నారు. 
 
ఏడేళ్లుగా తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య సోద‌ర‌భావం ఉంద‌ని చెప్పుకొచ్చారు. తెలుగు ప్ర‌జ‌లంతా బాగుప‌డాల‌న్న‌దే కేసీఆర్ ఆకాంక్ష అని, ఏపీ అక్ర‌మ ప్రాజెక్టుల వ‌ల్ల తెలంగాణ న‌ష్ట‌పోతుంద‌నేదే త‌మ‌ బాధ అని చెప్పారు.
 
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ అడ్డుప‌డ‌లేదా? అని ప్ర‌శాంత్ రెడ్డి నిల‌దీశారు. తెలంగాణ నీళ్ల‌ను ఆయ‌న ఆంధ్రాకు త‌ర‌లించుకుపోలేదా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు వైఎస్సార్‌ను మించి ఏపీ సీఎం జ‌గ‌న్ జ‌గ‌న్ ఎక్కువ నీరు త‌ర‌లిస్తున్నార‌ని మ‌రోసారి విరుచుకుప‌డ్డారు.
 
కృష్ణాపై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ‌ రాష్ట్ర రైతులు నష్టపోతారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అలాగే, నీటివాట తేల్చకుండా జాప్యం చేస్తున్న కేంద్ర స‌ర్కారు తీరు స‌రికాద‌న్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ తీరు ప‌ట్ల తాము నిరసన తెలుపుతామ‌ని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments