Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ పేట జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన

Webdunia
సోమవారం, 9 మే 2022 (13:07 IST)
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సోమవారం నారాయణ పేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన రూ.81.94 కోట్ల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, సోమవారం సాయంత్రం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. 
 
మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఉదయం 11 గంటలకు నారాయణపేటకు చేరుకుంటారు. సింగారం వద్ద మిషన్ భగీరథ పంప్ హౌస్, అక్కడే సబ్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు ఆరో వార్డులో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న పార్కు నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తారు. బీసీ కాలనీ పార్కు వద్ద రూ.20 కోట్లతో నిర్మించే గోల్డ్ సోక్ మార్కెట్‌ నిర్మాణానికి ఆయన భూమిపూజ  చేస్తారు. 
 
ఆ తర్వాత రూ.6.66 కోట్ల వ్యయంతో నిర్మించే మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. పిమ్మట రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. రజకుల కోసం రూ.కోటి వ్యయంతో నిర్మించే ఆధునిక లాండ్రీకి మంత్రి భూమి పూజ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments