Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌‍కు తరలిస్తున్న ఏపీ సర్కారు : మంత్రి హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (17:22 IST)
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పెన్నా బేసిన్‌కు తరలిస్తుందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పైగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకాల సమస్యను పరిష్కరించమంటే కేంద్రం మీనమేషనాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్రంతో తెరాస ప్ర‌భుత్వానికి ఎలాంటి వ్య‌క్తిగ‌త పంచాయ‌తీ లేదు. మా స‌మ‌స్య‌.. మా నీళ్లు మాకు ద‌క్కాలి.. తెలంగాణ ఉద్య‌మం జ‌రిగిందే నీళ్లు, నిధులు నియామ‌కాల మీద. నీళ్ల విష‌యంలో ఏడేండ్ల నుంచి కేంద్రం తెలంగాణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదు అని ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. 
 
అక్ర‌మంగా ఏపీ ప్ర‌భుత్వం పెన్నా బేసిన్‌కు కృష్ణా జ‌లాల‌ను తీసుకెళ్తుంది. కృస్ణా జ‌లాల్లో మాకు న్యాయ‌మైన వాటా రావ‌డం లేదు. కృష్ణా బేసిన్‌లో మా నీటి వాటా మాకు కావాలంటే కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నాం. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు కాబ‌ట్టి త‌క్ష‌ణ‌మే ట్రైబ్యున‌ల్ ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నామ‌ని హ‌రీశ్‌రావు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments