లా సెట్ నోటిఫికేషన్ - 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో న్యాయ విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే లా సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ అయింది. మూడు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎంఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ శనివారం రిలీజ్ చేశారు. 
 
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 6 నుంచి జూన్ 6న తేదీ వరకు కొనసాగుతుంది. ఎల్ఎల్‌బీకి ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులు రూ.1000 చొప్పున దరఖాస్తు ఫీజును చెల్లించాల్సివుంటుంది. ఈ పరీక్షలు జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. ఎల్ఎల్బీలో ప్రవేశానికి డిగ్రీ లేదా ఇంటర్ జనరల్, బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు 45, 42, 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. 
 
2022-23 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, మహాత్మా గాంధీ వీసీ ప్రొఫెసర్ గోపాలరెడ్డి, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రనివాస రావు, లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీవీ రెడ్డిలు ఈ నోటిఫికేషన్‌ను చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం లాసెట్ వెబ్ సైట్‌ను పరిశీలించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments