Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (10:15 IST)
తెలంగాణలో ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. సోమవారం నుంచి జులై 5 వరకు విద్యార్థులు రుసుం చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. 
 
అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రవేశాలు, కోర్సులు, సీట్ల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ, నోటిఫికేషన్, సహాయ కేంద్రాల సమాచారాన్ని https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని కన్వీనర్ వెల్లడించారు. 
 
కాగా, తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికిగాను పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగులో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. మొత్తం 116 కళాశాలల్లో 29,396 సీట్లకు గాను 21,367 సీట్లను భర్తీ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో 87.44 శాతం, ప్రైవేటు కళాశాలల్లో 60.46 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 
 
సైబర్ సెక్యూరిటీ డిప్లొమా కోర్సుకు సంబంధించి మొత్తం సీట్లు భర్తీ కాగా, జౌళి సాంకేతిక డిప్లొమా కోర్సులో 64 సీట్లకు గాను కేవలం 9 మంది విద్యార్థులే చేరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంకా 1,673, ప్రైవేటు కళాశాలల్లో 6,356 చొప్పున మొత్తం 8,029 సీట్లు ఖాళీగా ఉన్నాయని పాలిసెట్ కన్వీనర్ తెలిపారు. 
 
ఎన్సీసీ, క్రీడల కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్ అనంతరం కేటాయిస్తామని సీట్లు పొందిన విద్యార్థులు జులై 7 నుంచి 10 వరకు తమ కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దుచేస్తామని తెలిపారు. కళాశాలల్లో జులై 7 నుంచి 14 వరకు పునశ్చరణ జరుగుతుందని, 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments