Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ పుట్టిన రోజు.. కోటి వృక్షార్చన.. రాహుల్‌ సిప్లిగంజ్‌, మధుప్రియల పాట..

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (14:34 IST)
KCR
ఈ నెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. దీనిద్వారా హరిత ప్రియుడికి కోటి మొక్కల బహుమతిని అందిద్దామని చెప్పారు. 
 
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు. ఈ పాటలను ప్రముఖ నేపథ్య గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, మధుప్రియ పాడారు. కేసీఆర్‌ పుట్టిన రోజైన ఈనెల 17న జంట నగరాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు. 
 
ఎమ్మెల్సీ కవిత బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీరను సమర్పిస్తారని వెల్లడించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీతో నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 300 మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
 
నేటి నుంచి 17 వరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కోటి కుంకుమార్చన, 17న హోమం, సికింద్రాబాద్‌ గణేష్‌ దేవాలయంలో గణపతి కల్యాణం, అన్నప్రసాద కార్యక్రమం, నాంపల్లిలోని హజరత్‌ దర్గాలో దట్టీ సమర్పణ, పేదలకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ సుపరిపాలన సాగించాలని గురుగ్రంధ సాహెబ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.
 
జలవిహార్‌లో కేసీఆర్‌ బాల్యం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంపై 3డీ గ్రాఫిక్స్‌లో 30 నిమిషాల డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందన్నారు. బోయిగూడ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా జలవిహార్‌లో మొక్కలు నాటుతామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments