Webdunia - Bharat's app for daily news and videos

Install App

యస్... ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం... కేసీఆర్ కుమార్తె కవిత, తెదేపా కొంప కొల్లేరేనా?

ప్రత్యేక హోదా ఉద్యమం తెలుగుదేశం పార్టీ కొంప ముంచుతుందా...? అంటే అవుననే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల వేళ చెప్పిన తెదేపా-భాజపా రెండూ రివర్స్ గేర్లు వేసుకున్నాయి. ప్రతి సభలోనూ ఏపీ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తామంటూ హామీలిచ్చ

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (15:08 IST)
ప్రత్యేక హోదా ఉద్యమం తెలుగుదేశం పార్టీ కొంప ముంచుతుందా...? అంటే అవుననే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల వేళ చెప్పిన తెదేపా-భాజపా రెండూ రివర్స్ గేర్లు వేసుకున్నాయి. ప్రతి సభలోనూ ఏపీ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తామంటూ హామీలిచ్చిన అధికార పార్టీలు ప్లేటు ఫిరాయించడంపై గత రెండేళ్లుగా అప్పుడప్పుడు ఆందోళనలు పెల్లుబుకుతూనే వున్నాయి. 
 
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రత్యేక హోదా కోసం ఎవరిదారిలో వారు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీనితోపాటు తాజాగా తెలంగాణ రాష్ట్రం కూడా గొంతు కలుపుతోంది. తెరాస ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతామంటూ ప్రకటించారు. 
 
తెలుగు రాష్ట్రాల స‌మస్య‌ల‌పై తెలుగువారమంతా క‌లిసి పోరాడాల్సి వుందని, అంతా కలిస్తే అనుకున్నది సాధించవచ్చని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ తమవంతు ప్రయత్నం చేస్తామని ఆమె వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం భేషరతుగా నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. మొత్తమ్మీద ప్రత్యేక హోదా కోసం ఇటు ఏపీ విపక్ష పార్టీలతో పాటు తెలంగాణ అధికార పార్టీ కూడా కలిసిరావడం తెదేపాకు ఇబ్బందికర పరిస్థితులను తేవడం ఖాయమే.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments