Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాలకు ఎన్నికల ముందు మంచి చేస్తే చాలు...: తెరాస ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి లక్ష్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే త్వరగా మరిచిపోతారన్నారు. వారు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే పనులు చేయకుండా ఉండటమే ఉత్తమమన్నారు. అందువల్ల సంక్షేమపథకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
 
మహబూబ్‌నగర్‌లో ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందన్నారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయారన్నారు. అందుకే రోజుకు 3 లేదా 4 గంటల పాటు మాత్రమే విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాలనుకుంటున్నానని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. 
 
జనాలను మంచివారు అనాలో, లేక అమాయకులు అనాలో అర్థం కావడం లేదని లక్ష్మారెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాలను ఇవ్వడం కూడా అనవసరమని... ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. జడ్చర్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments