తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె.. నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:03 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆమెకు సీఎం కేసీఆర్ బీ-ఫారం అందించారు. 
 
అయితే నామినేషన్ వేసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వాణీదేవికి నిరాశ ఎదురైంది. నామినేషన్ పత్రాలు సరైన ఫార్మాట్లో లేవని అధికారులు తిరస్కరించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాణీదేవి నిరాశతో వెనుదిరిగారు. దాంతో ఆమె మంగళవారం ఉదయం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.
 
కాగా, పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అధికార తెరాసపై భగ్గుమంటున్నారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. 
 
అలాగే, పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ స్పందించారు. ఎలాంటి గెలుపు అవకాశాలు లేని స్థానంలో తన చిన్నమ్మ వాణీదేవికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఓడిపోతుందని తెలిసీ టికెట్ ఇవ్వడం మోసం చేయడమేనని విమర్శించారు. 
 
ఓ మహనీయుడి పేరు చెప్పుకుని కుటిల రాజకీయాలకు పాల్పడ్డారని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని మోసం చేయడమే కాదని, బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చే ప్రయత్నమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments