Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్‌లతో కలిసి మొక్కలు నాటిన రానా...

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన హరితహారంలో సామాన్య ప్రజలతో పాటు సినీనటులు, రాజకీయవేత్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒకే రోజు 25 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా సాగుతున్

Webdunia
సోమవారం, 11 జులై 2016 (12:48 IST)
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన హరితహారంలో సామాన్య ప్రజలతో పాటు సినీనటులు, రాజకీయవేత్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒకే రోజు 25 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా సాగుతున్న హరిత యజ్ఞంలో పాల్గొని నగరాన్ని గ్రీన్ హైదరాబాద్‌గా చేద్దాం అని  మంత్రి  కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు సినీ తారలు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సినీనటుడు దగ్గుబాటి రానా సోమవారం ఉదయం నానక్రామ్ గూడలో రెండు మొక్కలు నాటాడు. 
 
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే నాటిన మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని వేడుకున్నాడు. మొక్కలు నాటుతున్న ఫోటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
 
అంతేకాదు... 'గుడ్ మార్నింగ్!! దిస్ ఈజ్ హౌ మై డే బిగెన్! ట్రీ ప్లాంటేషన్ ఇన్ నానక్ రామ్ గూడ!! మేక్ యూఆర్ ఆల్సో గ్రీన్!! అంటూ రానా ట్విట్ చేశాడు. రానాతో పాటు టాలీవుడ్ ముద్దు గుమ్మలు రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పలువురు సినీనటులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments