Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మి వుంటున్న అపార్టుమెంట్లోనే ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ మైకమింగా...? లింకుందా?

షాకింగ్ వార్తలు డ్రగ్స్ కేసులో బయటకు వస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ మైక్ కమింగాను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ డీజి అకున్ సబర్వాల్ తెలియజేశారు. మరోవైపు సినీ నటి చార్మిని ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్

Webdunia
బుధవారం, 26 జులై 2017 (21:21 IST)
షాకింగ్ వార్తలు డ్రగ్స్ కేసులో బయటకు వస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ మైక్ కమింగాను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ డీజి అకున్ సబర్వాల్ తెలియజేశారు. మరోవైపు సినీ నటి చార్మిని ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ విచారించారు. చార్మికి ముఖ్యంగా 4 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
 
గ్లామర్ కోసం కొద్ది మోతాదులో డ్రగ్స్ తీసుకునేవారంటూ ఆరోపణలున్నాయి. మీరు తీసుకుంటారా? డ్రగ్స్ పేరుతో డ్రగ్ ఫెస్టివల్స్ జరిగేవా... జరిగితే మీరు వెళ్లేవారా? కెల్విన్‌తో మీకు ఎప్పటి నుంచి పరిచయం వుంది? పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకునేవారా? ఈ నాలుగు ప్రశ్నలను సంధించి ఆమె నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా చార్మి రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
 
ఇకపోతే డ్రగ్స్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడుగా పేర్కొంటున్న 33 ఏళ్ల మైక్ కమింగా ఇప్పటివరకూ 4 సార్లు భారత్‌కు వచ్చినట్లు అకున్ సబర్వాల్ వెల్లడించారు. అతడి నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామనీ, మైక్ కమింగా వీసా గడువు 2018 వరకు ఉందని తెలిపారు. ఇతడి అరెస్టుతో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం వున్నట్లు ఆయన చెప్పారు. మరోవైవు ఈ కమింగా వుంటున్న అపార్టుమెంట్లోనే నటి చార్మి కూడా వుంటోందన్న వార్తలు వస్తుండటంతో ఇతడితో ఆమెకు డ్రగ్స్ వ్యవహారంలో ఏమయినా లింకులున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments