Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు క్లాసులు తీసుకుంటా అంటూ స్కూలు ఫీజులపై గళమెత్తిన నటుడు

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (14:00 IST)
కరోనా కష్టకాలంలోనూ పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ పేరుతో నిర్బంధ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూలు యజమాన్యం తీరుపై టాలీవుడ్ నటుడు శివబాలాజీ గళమెత్తారు. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ఈ పాఠశాల యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. 
 
ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, 'మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా' అంటూ శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments