Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరానికి ఏమైంది.. ఎక్కడ చూసినా టూ-లెట్ బోర్డులే!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (10:55 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అయితే, ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. ముంబై, చెన్నై, బెంగుళూరు తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగర వాసులు వణికిపోతున్నారు. 
 
అదేసమయంలో హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా మరోమారు లాక్డౌన్ విధించవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరేతులు తమతమ ఇళ్ళను ఖాళీ చేసి సొంతూళ్ళకు వెళ్లిపోయారు. దీంతో అనేక గృహాలకు టూలెట్ బోర్డులు వేలాడుతున్నాయి. 
 
ప్రధానంగా ఐటీ ఉద్యోగులంతా నగరాన్ని వీడి తమతమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. ఐటీ ఉద్యోగులకంతా వర్క్  ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించడంతో నూటికి 90 శాతం మంది ఉద్యోగులు తమ ఫ్లాట్స్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలాగే, వ్యాపారులు కూడా కరోనా వైరస్ భయం కారణంగా తమ షాపులను మూసివేశారు. ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. 
 
వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్‌లలో పని చేసే వారంతా సొంతూళ్ళకు వెళ్లిపోయారు. ఈ కారణంగా హైదరాబాద్ నగరంలో జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో లాక్డౌన్ 2 అమలు చేయనున్నారనే వార్తల నేపథ్యంలో నగరం బోసిపోయి కనిపిస్తోంది. దీంతో అనేక మంది గృహ యజమానులు తమ ఇళ్ళ ముందు టూలెట్ బోర్డులు వేలాడతీశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments