Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నావదినల వేధింపులు.. సోదరి చేతికి ఇనుప సంకెళ్లు

అన్నావదినలు వేధిస్తున్నారని ఓ చెల్లెలు తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె మానసిక ఆరోగ్యం బాగోలేదని.. పొరుగింటి వారిపై దాడి చేయాలని చూస్తోందని.. చేతులు కట్టేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కే

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (14:49 IST)
అన్నావదినలు వేధిస్తున్నారని ఓ చెల్లెలు తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె మానసిక ఆరోగ్యం బాగోలేదని.. పొరుగింటి వారిపై దాడి చేయాలని చూస్తోందని.. చేతులు కట్టేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణినగర్‌కు చెందిన చిట్యాల గీత అనే యువతి తన అన్నలైన చిట్యాల నారాయణ, రమేష్‌, శ్రీనివాస్‌లతో కలిసి ఉంటోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో గీత సోదరుల వద్దే వుంటూ డిగ్రీ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసింది. 
 
అయితే ఇటీవల అన్న, వదినల వేధింపులు ఎక్కువయ్యాయని, తనతో వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ కాలనీవాసులకు మొర పెట్టుకుంది. బుధవారం ఇంట్లో నుంచి పారిపోయింది. కానీ గీతను పట్టుకున్న అన్న వదినలు చేతికి గొలుసులు వేసి చితకబాదారు. ఆ సమయంలో స్థానికులతో గీత తాను ఇంటికి వెళ్లనని.. అనాధ ఆశ్రమానికి పంపాలని వేడుకుంది. 
 
స్థానిక కౌన్సిలర్‌ గుగ్గిల్ల హరీష్‌ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి చేరదీయడంతో పాటు టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గీతకు కౌన్సిలింగ్ ఇచ్చి హైదరాబాదులోని మహిళా, శిశు సంక్షేమ కేంద్రానికి తరలించామని జగిత్యాల జిల్లా ఎస్ఐ అనంత శర్మ వెల్లడించారు. తీవ్ర ఒత్తిడికి గురైన గీతను వైద్యులు పరీక్షించారని.. అన్నా వదినల కారణంగా వేధింపులకు గురైందని.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనంత శర్మ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments