Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ లవ్: ఇద్దరు తెలంగాణ యువతులను వచ్చేయమన్న అనంత కుర్రాళ్లు, కానీ...

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (17:05 IST)
టిక్ టాక్ పరిచయంలో ప్రేమలో పడిన ఇద్దరూ యువతులు తాము ప్రేమించిన యువకులను కలిసేందుకు గురువారం రాత్రి అనంతపురం జిల్లా దర్గాహోన్నూరు గ్రామానికి చేరుకున్నారు. సిద్దిపేట జిల్లా గద్వాల్ మండలం ముక్తమాసాస్ పల్లె గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు టిక్ టాక్ యాప్ ద్వారా దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వంశీ, వన్నూరు స్వామి అనే డిగ్రీ విద్యార్థులతో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
 
ఆ పరిచయం క్రమంగా పెరిగి పెళ్లి దాకా వచ్చింది. యువకుల మాటలు నమ్మి ఆంధ్రాకు వెళ్తున్నామని ఇంటిలో చెప్పి బుధవారం గద్వాల్ నుంచి రైలులో బయలుదేరారు. గుంతకల్లుకు చేరుకొని అక్కడి నుంచి దర్గా హోన్నూరు గ్రామానికి గురువారం రాత్రి చేరారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత యువకులు మాట మార్చడంతో వీరు విచారిస్తుండగా గ్రామస్తులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. 
 
సమస్య కొలిక్కి రాకపోవడంతో గ్రామస్తులు బొమ్మనహల్ మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా యువతులను కళ్యాణ్ దుర్గంలోని ఉజ్వల హోమ్‌కు తరలించారు. అక్కడి నుండి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments