Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు గురై మూడేళ్ల చిన్నారి మృతి

Webdunia
శనివారం, 29 జులై 2023 (17:06 IST)
మూడేళ్ల చిన్నారి పాముకాటుకు గురైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలకో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీపేట మండలం బినోలకు చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులు. వీరికి కుమారుడు రుద్రాన్ష్‌ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. 
 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో భూమయ్య కుటుంబం శుక్రవారం పక్కనున్న మరో గదిలో నిద్రించారు. గాఢనిద్రలో ఉండగా.. రెండు పాములు వచ్చి రుద్రాన్ష్‌ను కాటు వేశాయి.  బాలుడు నిద్రలోనే గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై నిద్రలేచారు.  
 
బాలుడికి సమీపంలో రెండు పాములు వెళ్లటాన్ని భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చిన్నారి ఇవాళ మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments