Webdunia - Bharat's app for daily news and videos

Install App

13ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. కంప్లైంట్ చేస్తే పట్టించుకోని పోలీసులు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:20 IST)
దేశంలో మహిళలపై నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్ రేప్ చేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు.

ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంతవరకు వారిపేర్లను బయటకు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. నిందితుల వద్దనుండి డబ్బులు తీసుకొని ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.  
 
వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండల పరిధిలోని దుంపకుంట సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు కామాంధులు. అక్కడ ఈ ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

ఇంటికి వచ్చిన బాలిక ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీశారు. భయపడిపోయిన ఆ బాలిక ముగ్గురు వ్యక్తులు కలిసి నన్ను బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ జోగిపేటలో ఫిర్యాదు చేశారు.
 
ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా విచారణ కొనసాగతుందని వారికి సమాధానం చెబుతున్నారు. కానీ నిందితులు వద్ద లంచం తీసుకొని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం