Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికే భర్త నుంచి అప్పు తీసిచ్చిన భార్య, అది కాస్తా బయటపడటంతో...

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (10:11 IST)
ఏవండీ.. మా బంధువు ఆయన. మన ఊర్లో రైస్ మిల్లు పెడుతున్నాడు. మన సహాయం కావాలి. మీరు అప్పు ఇస్తే రైస్ మిల్లు పెట్టుకుని బాగా నిలదొక్కుకుంటాడు. మన డబ్బు మనకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాడని భార్య చెప్పింది. భార్యే అంతగా చెబుతోందని డబ్బులిచ్చాడు. కానీ ఆ డబ్బులివ్వలేదు సరికదా డబ్బులు తీసుకున్న వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం నడుపుతోందని తెలుసుకుని షాకయ్యాడు భర్త.
 
తెలంగాణా రాష్ట్రం సిద్ధిపేట వివేకానంద ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, రాజేశ్వరికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇక్కడే స్థిరపడింది శ్రీనివాస్ కుటుంబం. రాజేశ్వరి స్వగ్రామం సమీపంలోని దుద్దెడ. సాఫీగా సాగిపోతున్న కుటుంబం. 
 
అయితే సరిగ్గా నెల క్రితం ఆ ప్రాంతానికి రాజు అనే వ్యక్తి వచ్చాడు. రాజేశ్వరి బంధువే. వరుసకు బావ. అసలు రాజేశ్వరిని ముందుగా రాజుకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నారు. కానీ ఆస్తి లేకపోవడంతో శ్రీనివాస్‌తో పెళ్ళి జరిగింది. రాజేశ్వరి, రాజుల మధ్య గతంలోనే ప్రేమాయణం సాగింది.
 
శ్రీనివాస్ అప్పు ఇస్తున్నాడని తెలుసుకున్న రాజు తనకు పరిచయమైన రాజేశ్వరిని రిక్వెస్ట్ చేశాడు. తాను మీ గ్రామంలోనే రైసు మిల్లు పెడతానని... కాస్త డబ్బులు తీసివ్వమని కోరాడు. డబ్బు కోసం రాజేశ్వరి చుట్టూ పదేపదే తిరిగేవాడు. 
 
ఇలా తిరగడంతో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రాజేశ్వరి భర్తకు నచ్చచెప్పి డబ్బులు తీసిచ్చింది. అయితే రైస్ మిల్లు పెట్టిన రాజు డబ్బులివ్వడంలో ఆలస్యం చూపించాడు. దీంతో  పాటు తన భార్య రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని శ్రీనివాస్‌కు తెలిసింది. 
 
దీంతో ఆమెను మందలించాడు. భర్త మందలింపుతో భయటపడిన రాజేశ్వరి రాజుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. సుపారీ ఇచ్చి శ్రీనివాస్‌ను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు రాజు, రాజేశ్వరి. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడి కటాకటాల పాలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments