ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (21:04 IST)
లాక్ డౌన్ సమయంలో దోపిడీకేదీ అనర్హత కాదని తేలిపోయింది. చేతివాటం సరిగ్గా పనిచేయకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారో ఇద్దరు దొంగలు. 

సిద్ధిపేట్ జిల్లా లోని రాజీవ్‌ రహదారిపై సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ వద్ద జగదేవపూర్‌ వెళ్లే దారిలో ఉన్న 'ఇండియా వన్‌' ఏటీఎం చోరికి గురైందని పోలీసులు తెలిపారు.
 
ఏటీఎం నుంచి నగదును దొంగిలించేందుకు యత్నించిన దుండగులు, డబ్బులు రాకపోవడంతో గడ్డపారలతో దాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. 
 
తెల్లవారే సరికి ఏటీఎం మిషన్ కనిపించక పోవడంతో ఇంటి యాజమాని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో నిర్వహకులు గజ్వేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఏటీఎంలో ఉన్న రూ.4,98,800 నగదు ఉన్నట్లు నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments