Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృశ్యమైన బాలిక, బండచెరువులో శవమై తేలింది...

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:00 IST)
నేరెడ్‌మెట్ లోని కాకతీయనగర్‌లో గురువారం సాయంత్రం తప్పిపోయిన 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతంగా మారింది. నిన్న రాత్రి సైకిల్ పైన బయటకు వెళ్లిన సుమేద ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో కలిసి నిన్నరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టారు.
 
అయితే ఇవాళ బండచెరువులో బాలిక మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటివరకు తమ పాప ఎక్కడో ప్రాణాలతో ఉంటుందని తల్లిదండ్రులు అనుకున్నారు కానీ ఇలా మృతదేహాన్ని చూసి కన్నీరు పాలవుతామని ఊహించలేకపోయారు. భారీ వర్షాలు తర్వాత దీన్ దయాల్ నగర్‌లో నాలాలన్నీ నీటిలో మునిగిపోయాయి.
 
బాలిక సైకిల్‌ను నాలా సమీపంలో పోలీసులు గమనించి బాలికను కనిపెట్టే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం అధికారులను అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత అధికారులు బాలిక మృతదేహాన్ని వెలుపలికి తీసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments