Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఓ పిల్ల.. ఆంధ్రాలో ఓ అమ్మాయి : వ్యక్తిపై ఫిర్యాదు

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (17:53 IST)
తెలంగాణాలో ఓ పెళ్లిని... ఆంధ్రాకు వచ్చి మరో పెళ్లిని చేసుకున్న వ్యక్తిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేల్దారి పని కోసం తెలంగాణాకు వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ళపాటు కాపురం చేశాడు. ఆ తర్వాత చెప్పాపెట్టకుండా ఆంధ్రకు వచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మోసం వెలుగులోకి రావడంతో బాధిత మహిళల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం బోయినపల్లి మండలం వర్ధపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వనజకు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తుమ్మల మహేష్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అనారోగ్యంతో భర్త మహేష్‌ చనిపోయాడు. 
 
వెలిగండ్ల మండలం గండ్లోపల్లికి చెందిన జొన్నలగడ్డ నిరీక్షన్‌ బేల్దారి పని చేసుకునేందుకు వర్దపల్లి వెళ్లాడు. అక్కడ వనజతో పరిచయం ఏర్పడింది. వనజను వివాహం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసి చెప్పాపెట్టకుండా ఏపీకి వచ్చి గండ్లోపల్లిలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసి ఆమె నిరీక్షన్‌కు ఫోన్‌ చేయగా తాను వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నానని, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించినట్లు ఫిర్యాదులో వనజ పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ముస్తఫా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments