Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో స్కూల్స్ ఓపెన్‌కు చర్యలు : తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:15 IST)
సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణా రాష్ట్రంలో పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. దీంతో పాఠశాలలను ప్రారంభించాలన్న నిర్ణయానికి విద్యాశాఖ వచ్చింది. అదేసమయంలో మూడో దశ కరోనా వ్యాప్తి ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని సూచించింది. ఇందుకోసం కొన్ని సూచలు, జాగ్రత్తలతో మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
 
ప్రధానంగా, ప్రతిరోజూ గదులు, కుర్చీలు, బెంచీలు, ఇతర పరికరాలను విధిగా శానిటైజ్‌ చేయాలి. చేతులతో తాకే ప్రతి ప్రదేశాన్ని శానిటైజ్‌ చేయాలి. మరుగుదొడ్లకు నీటి సదుపాయం కల్పించాలి. సబ్బులు అందుబాటులో ఉంచాలి. పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. 
 
విద్యార్థులకు కరోనా నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలన్న నిబంధన విధించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న విద్యార్థులను అనుమతించకూడదు. విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే రోజుకు రెండు బ్యాచ్‌లకు వేర్వేరుగా తరగతులు నిర్వహించాలి. లేకుంటే ఒక రోజు ఒక బ్యాచ్, మరుసటి రోజు ఇంకో బ్యాచ్‌కు తరగతులు నిర్వహించాలి. 
 
విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ప్రతి గది వద్ద శానిటైజర్‌ ఏర్పాటు చేయాలి. మాస్క్‌లను కూడా అందుబాటులో ఉంచాలి. హాస్టళ్లను ప్రత్యేక జాగ్రత్తల నడుమ తెరవాలి. విద్యార్థుల రూముల్లోకే భోజనం పంపించేలా ఏర్పాట్లు చేయాలి. అయితే అవకాశం ఉన్నవాళ్లు హాస్టళ్లకు తమ పిల్లలను పంపకుండా ఇంటినుంచే స్కూళ్లు లేదా కాలేజీలకు పంపించాలి. ఇలాంటి అనేక నిబంధనలతో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments