Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్ గంగా నదిపై బ్యారేజీకి రూ.500 కోట్లు: అమరవీరులకు రూ. 13.20కోట్లు!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (19:15 IST)
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అకోలి వద్ద పెన్ గంగా నదిపై తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీని నిర్మించబోతోంది. బ్యారేజీ సర్వే పనులను రాష్ట్ర మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్, తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ. 500 కోట్లతో బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే, 20 వేల హెక్టార్లకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
 
అలాగే 132 అమరవీరుల కుటుంబాలకు రూ.. 10లక్షల వంతున రూ. 13.20 కోట్లను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ఎంత చేసినా రుణం తీరదని... తెలంగాణ రియల్ హీరోస్ అమరవీరులేనని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
 
సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో 132 అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున రూ. 13.20 కోట్లను ఈటెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నారన్నారు. బంగారు తెలంగాణను సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments