Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (09:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
మెదక్, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను కల్పించారు. సీసీ టీవీ కెమెరాలతోపాటు వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదీన చేపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments