Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి ఘోర ప్రమాదం... తన కారులో ఆస్పత్రికి తరలించిన కేటీఆర్...

హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి ఆర్‌టీఏ కార్యాలయం వద్ద గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (09:34 IST)
హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి ఆర్‌టీఏ కార్యాలయం వద్ద గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లాలాపేటకు చెందిన ఎండీ అజార్‌(37), ఇమ్రానాబేగం(35) దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఓ కార్యక్రమానికి హాజరై... అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు.
 
వారి వాహనం ఆర్‌టీఏ కార్యాలయం వద్ద మలుపు తీసుకుంటుండగా... జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు వాహనం (ఎపీ24వీ5893) వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆజర్‌(37), అమన్‌(9), అశ్వియా(7), అలీనా(3) అక్కడికక్కడే చనిపోయారు. అజహర్ భార్య ఇమ్రాన్‌బేగం, మరో చిన్నారి అదియా తీవ్రంగా గాయపడ్డారు.
 
రోడ్డు ప్రమాదం జరిగిన సమయానికే అటుగా మంత్రి కేటీఆర్ వెళుతున్నారు. ఈ ప్రమాదాన్ని చూసి చలించిపోయిన కేటీఆర్.. తక్షణం తన కారును ఆపి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేరవేయగా, ఆయన ప్రమాద స్థలానికి వచ్చి క్షతగాత్రుల వెంట ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరణించిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పారిపోయాడు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments