Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్.. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త.. మంత్రి హరీశ్‌రావు

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (09:52 IST)
భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, అప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 
 
గ్రామ స్థాయిలో మలేరియా, డెంగీ, టెస్టింగ్‌ కిట్లతోపాటు కోవిడ్‌ పరీక్షల కోసం ర్యాపిడ్‌ కిట్లను, జిల్లా దవాఖానల్లో ఆర్టీపీసీఆర్‌ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయన్నారు.  
 
బూస్టర్‌ డోస్‌ పంపిణీని వేగవంతం చేసి నెల రోజుల్లోగా పూర్తిచేసేలా అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా బూస్టర్‌ డోస్‌లు వేయాల్సి ఉన్నదన్నారు. రెండో డోస్‌ వేసుకొని 6 నెలలు దాటినవారిలో ప్రతిరక్షకాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున అందరూ ప్రికాషన్‌ డోస్‌ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
మంకీపాక్స్‌పై ఎవరూ భయపడాల్సినక్కర్లేదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎవరికైనా జ్వరం, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments