Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంబంధం లేని ప్రాంతంలో కృష్ణా బోర్డు ఏర్పాటా? : తెలంగాణ మెలిక

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (15:36 IST)
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం తమకు సమ్మతం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది తమకు అనుకూలం కాదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. 
 
విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే అంగీకారం తెలిపామని, ఇప్పుడు కృష్ణా బేసిన్‌కు బయట, సంబంధం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందవుతుంది. 
 
అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కూడా ఈ విషయం చర్చించకుండా అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరైంది కాదంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు.
 
దీంతోపాటు కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌ మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు కూడా బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. ఇటీవల పరిపాలనా అనుమతి ఇచ్చిన మూడు ప్రాజెక్టుల గురించి వివరించినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments